- తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శిరుప అనిల్
కొమురవెల్లి, వెలుగు : తెలంగాణ రాష్ట్రంలో యువత ప్రతి సేవా కార్యక్రమాల్లో ముందుండాలని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శిరుప అనిల్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు గంప శ్రీనివాస్ అన్నారు. గురువారం కొమరవెల్లిలోని శ్రీ వాసవి నిత్యన్నాదాన సత్రంలో తెలంగాణ రాష్ట్ర, జిల్లా ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగం కార్యవర్గ సమావేశాలను సిద్దిపేట జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మంకాల నాగేశ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలోని ఆర్యవైశ్య సమాజంలోని పేదలు, నిరుద్యోగులు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు యువత అండగా నిలుస్తూ, యువతను సేవా కార్యక్రమాల వైపు నడిపించడమే తమ లక్ష్యమన్నారు.
ఆర్యవైశ్య సమాజం అంటే వ్యాపార రంగంలోనే కాకుండా దానధర్మాలు, అన్నదానాలు, విద్య, వైద్యం, సమాజ సేవ వంటి అనేక రంగాల్లో ముందుండే సమాజమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్య సమాజంలోని పేద కుటుంబాలకు, నిరుద్యోగ యువతకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. అనంతరం సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో వివిధ బాధ్యతలు చేపట్టిన ఆర్యవైశ్య నాయకులు, సిద్దిపేట జిల్లా యువజన విభాగం ప్రతినిధులను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉప్పల చంద్రశేఖర్, రాష్ట్ర కోశాధికారి సోమిశెట్టి పవన్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌరిశెట్టి శ్రీధర్, అదనపు ప్రధాన కార్యదర్శి మైలారపు రాంబాబు, మహాసభ జిల్లా అధ్యక్షులు తణుకు ఆంజనేయులు, జిల్లా యూత్ కోశాధికారి చిట్టా నాగరాజు, జిల్లా యూత్ అదనపు ప్రధాన కార్యదర్శి తేరాల మారుతి, జిల్లా యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరవపల్లి హరి కిరణ్, సిద్దిపేట జిల్లా జనరల్ సెక్రటరీ సముద్రాల హరినాథ్, కోశాధికారి మాంకాల నవీన్ కుమార్, మండల యూత్ అధ్యక్షుడు అంబడిపల్లి ఈశ్వర్, సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగం సభ్యులు పాల్గొన్నారు.
